నేచురల్ స్టార్ హీరో నాని బర్త్ డే సందర్భంగా అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ సినిమా అప్‌డేట్ తో జోష్ లో ఉన్న ఫ్యాన్స్‌కు, తన 32వ మూవీ టైటిల్ ప్రకటనతో మరో అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించారు. గతేడాది పవర్ స్టార్ ను ‘ఓజీ’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అదరగొట్టిన సుజీత్ డైరెక్షన్ లో నాని చేయబోయే ఈ మూవీకి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో నానిని సుజీత్ ఏ స్టైల్ లో చూపిస్తాడో అని అభిమానులు ఉహించుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ సహా ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్, నాని సొంత బ్యానర్ అయిన యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2026 లో విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.