కల్తీ పాలు సేవించి అనూరియా సమస్యతో బాధపడుతున్న బాధితులను మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. రాజమహేంద్రవరంలో ఇటీవల కల్తీ పాలు సేవించి అనూరియా సమస్యతో బాధపడుతూ కిమ్స్, రెయిన్బో, ఆదిత్య, యూనివర్సల్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న చిన్నారులు, బాధితులను పరామర్శించి, చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో సమగ్రంగా సమీక్షించారు.ఈ కఠిన పరిస్థితులలో వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో ఎటువంటి రాజీ పడకూడదని డాక్టర్లకు సూచించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా నింపారు.