చిన్నారి పునర్వికకు లోకేష్ భరోసా

Spread the love

SMA Type-1 తో బాధపడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక అనే పాపను ఆదుకునేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవ చూపారు. అరుదైన వ్యాధితో పోరాడుతున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ దృష్టికి సోషల్ మీడియా ద్వారా తీసుకువచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

SMA Type-1 తో ఆ చిన్నారి బాధపడుతుందని  దానికి ట్రీట్మెంట్ గా 16 కోట్ల ఇంజక్షన్ ఒక్కటే ఆప్షన్ అని అన్నారు. దానికోసం మేము అన్ని రకాలుగా ప్రయత్నిస్తే ప్రజల నుంచి, దాతల నుంచి మంచి స్పందన వచ్చి దాదాపుగా 10 కోట్ల వరకు సమకూరాయి. ఇంకా 6 కోట్ల వరకు అవసరం ఉంది. అంత భరించే స్తోమత నాకు లేదు. మిగిలిన 6 కోట్లు మీరు దయ ఉంచి సహాయం చేస్తే నా పాప కోలుకుంటుంది సార్ అంటూ ఆ తల్లిదండ్రులు తమ పరిస్థితిని వివరించారు. దీనిపై లోకేష్ స్పందించారు. 

పునర్విక ఒక గొప్ప వీరవనితలా ఈ పోరాటాన్ని అసాధారణ ధైర్యంతో ఎదుర్కొంటోంది.ఆమె ప్రాణాలను కాపాడే ఇంజెక్షన్ ధర అక్షరాలా ₹16 కోట్లు. పునర్విక గాథ వేలాది మంది దాతృత్వం కలిగిన వ్యక్తులను కదిలించడం, ఆ చిన్నారి ప్రాణాలను కాపాడటానికి వారు ముందుకు రావడం ఎంతో సంతోషకరమని మంత్రి లోకేష్ అన్నారు.  ఇప్పటికే ₹10 కోట్లు వసూలయ్యాయి. ఈ గొప్ప కార్యంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు పునర్వికకు అవసరమైన మిగిలిన ₹6 కోట్ల నిధిని సమకూర్చి, ఆమెకు అందాల్సిన ప్రాణ రక్షణ చికిత్సను అందించే బాధ్యతను తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డ అయిన ఈ ధైర్యవంతురాలికి అండగా నిలిచి, ఆర్థిక సాయం చేయవలసిందిగా అందరినీ విన్నవించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *