వెస్టిండీస్ పై 9వికెట్ల తేడాతో సౌతాఫ్రికా భారీ విక్టరీ 

Spread the love

టీ 20 వరల్డ్ కప్ సూపర్-8లో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రోమారియో షెపర్డ్ 52 నాటౌట్ (37; 3×4, 4×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. జాసన్ హోల్డర్ 49 (31; 4×4, 3×6), బ్రాండన్ కింగ్ (21) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి 3 వికెట్లు, కగిసో రబడా 2 వికెట్లు, కోర్బిన్ బోస్చ్ 2 వికెట్లు తీశారు. ఇక టార్గెట్ ఛేజింగ్ లో సౌతాఫ్రికా ఎక్కడా తడబడలేదు. మార్క్రమ్ 82 నాటౌట్ (46; 7×4, 4×6) విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.  డికాక్ 47(24; 4×4, 4×6), రికెల్టన్ 48నాటౌట్ (28; 4×4, 2×6) సత్తా చాటారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపుతో భారత్ కు ఊరట లభించినట్లైంది. అదే విండీస్ గెలిచి ఉంటే భారత్ సెమీస్ అవకాశాలపై ప్రభావం ఉండేది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *