ఫ్లాట్ గా ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Spread the love

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ఇన్వెస్టర్లు పై స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గు చూపడంతో సూచీలు తమ గరిష్టాల నుంచి దిగివచ్చాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ సుమారు 27 పాయింట్ల స్వల్ప నష్టంతో 82,248 వద్ద ముగిసింది.  నిఫ్టీ 14 పాయింట్ల స్వల్ప లాభంతో 25,496 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.90.94గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్ షేర్లు లాభాలతో ముగిశాయి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *