మనమిత్రను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 1.48కోట్ల సేవలు అందించామని వివరించారు. వాట్సాప్ సర్సీసులపై యూజర్ల నుండి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. ఏఐ ఇంటిగ్రేషన్ చేసి ఈ యాప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మనమిత్ర వాట్సాప్ సేవలపై అసెంబ్లీలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ వాట్సాప్ సేవలవల్ల టైమ్ సేవ్ అవుతోంది. ఎటువంటి ఫీజు లేకుండా సేవలందించడం హర్షణీయం. అయితే యాప్ బాగా స్లోగా ఉండటం వల్ల అందరూ యూజ్ చేసుకోలేకపోతున్నారు. ఇతర యాప్ ల మాదిరి ఒకసారి వివరాలు నమోదు చేశాక మళ్లీ చేసే అవసరం లేకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఉపయోగించుకునేలా మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ అంశంపై మంత్రి లోకేష్ బదులిస్తూ మనమిత్ర ప్లాట్ ఫాంపై ఎలాంటి డేటా స్టోర్ చేయడం లేదని వాట్సాప్ అనేది ఒక హైవే. డేటా డిపార్ట్ మెంట్ వద్ద ఉంటుంది. దీనివల్ల ప్రతిసారి డీటైల్స్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ప్రాసెస్ ను డిజిటలైజ్ మాత్రమే చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు అన్ని సేవలు సెల్ ఫోన్ లో ఒక్క బటన్ నొక్కడం ద్వారా ఇంటి ముందుకే వస్తున్నాయి. అదే బటన్ ద్వారా ప్రజలకు అవసరమైన సివిల్ సర్వీసులు, సర్టిఫికెట్లు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన తనకు యువగళం పాదయాత్ర సమయంలో వచ్చిందని వివరించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సింగిల్ ఫోన్ నెంబర్ ద్వారా పెద్దఎత్తున వాట్సాప్ సేవలు అందిస్తున్నాం. ఇంకా వేగం పెంచాలి, వెనువెంటనే రిసీట్ రావాలి, క్యూ ఆర్ కోడ్ సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. సభ్యులు మినమిత్ర యాప్ కు సంబంధించి ఫీడ్ బ్యాక్ ఇస్తే 90రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకొని మనమిత్ర 2.0 ప్రారంభిస్తాం. దీనిపై డోర్ టు డోర్ టు క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ వివరించారు.