ఈసారి పండగకు వెంకటేష్-కళ్యాణ్ రామ్ లతో రానున్న అనిల్ రావిపూడి

Spread the love

అనిల్ రావిపూడి సినిమా అంటేనే మినిమమ్ గ్యారంటీ మాత్రమే కాదు బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షమనే ముద్రపడిపోయింది. ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి  మెగాస్టార్ చిరంజీవి విక్టరీ  వెంకటేష్ లతో కలిసి ‘మన శంకరవరప్రసాదారు’ చిత్రంతో భారీ హిట్ ను తీసి అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ఇక ఇప్పుడాయన వచ్చేసంక్రాంతి కోసం మరో ఆసక్తికర కాంబినేషన్ ను పట్టాలెక్కించనున్నారు. విక్టరీ వెంకటేశ్ -నందమూరి కళ్యాణ్ రామ్ లతో సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా  వేదికగా అధికారికంగా ప్రకటించారు. “మొదటిసారి బొమ్మ తీసే అవకాశమిచ్చిన హీరో కళ్యాణ్ రామ్, మొదటి రూ.వందకోట్ల బొమ్మ కొట్టిన హీరో వెంకటేశ్తో కలిసి 2027 మొదటి పండక్కి మీ ముందుకొస్తున్నాం”అని అనిల్ పోస్ట్ చేశారు. మన దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి మళ్ళీ #VenkyAnil5 కోసం వచ్చేశాను. మేము కలిసిన ప్రతిసారీ, బోలెడంత వినోదం, సానుకూలత మరియు సందడితో నిండిన సొంత ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతి కలుగుతుంది! మా ఈ ప్రయాణంలో కళ్యాణ్ రామ్  కూడా తోడవ్వడం మా అందరికీ ఎంతో సంతోషంగా మరియు ప్రత్యేకమని పండగకు కలుద్దాం అని పేర్కొన్నారు. అటు కళ్యాణ్ రామ్ సైతం ఈ కాంబినేషన్ పై తన సంతోషం వ్యక్తం చేశారు. అనిల్, ‘పటాస్’ తర్వాత మళ్ళీ నీతో చేయడం  ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈసారి మన అందరికీ ఇష్టమైన విక్టరీ వెంకటేష్  గారితో కలిసి ఒక అద్భుతమైన వినోదాత్మక చిత్రం చేయబోతున్నాం.షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఇక ఈసారి అరుదైన కాంబినేషన్ తో వచ్చి మరో ఎంటర్టైనర్ తో అనిల్ సందడి చేయనున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *