కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ భారత్ లో పర్యటిస్తున్నారు. దేశానికి చేరుకున్న ఆయనకు భారత్ ఘన స్వాగతం పలికింది. కెనడా ప్రధానితో పాటు ఆ దేశానికి చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా భారత్ వచ్చింది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. వ్యాపారవేత్తలను కలవడానికి మరియు కెనడా కార్మికులు మరియు వ్యాపారాలకు కొత్త అవకాశాలను కల్పించే భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి మేము ముంబై చేరుకున్నామని మార్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారతదేశానికి తన మొట్టమొదటి అధికారిక పర్యటనలో భాగంగా ముంబై చేరుకున్న కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీకి సాదర స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్-కెనడా సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ఆయనకు ఎయిర్ పోర్ట్ లో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి జయకుమార్ రావల్ స్వాగతం పలికారు. భారత్-కెనడా భాగస్వామ్యం ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, పటిష్టమైన ప్రజల మధ్య సంబంధాలు మరియు వివిధ రంగాలలో విస్తరిస్తున్న సహకారంపై ఆధారపడి ఉంది. కెనడాలో స్థిరపడిన లక్షలాది మంది భారతీయ సంతతి ప్రజలు ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, ఇరు దేశాల మధ్య ఒక కీలక వారధిలా నిలుస్తున్నారు.ఎడ్యుకేషన్, ఫ్యూయల్, టెక్నాలజీ మరియు వాణిజ్య రంగాల్లో సహకారం ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది.