‘రణబాలి’ నుండి స్పెషల్ సర్ప్రైజ్

Spread the love

‘టాక్సీవాలా’ వంటి హిట్ తర్వాత విజయ్ దేవరకొండ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో కలిసి పని చేస్తున్న సినిమా ‘రణబాలి’. ఈ సినిమా బ్రిటిష్ పాలన కాలాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా. ఆ కాలానికి సంబంధించిన వాతావరణం, దుస్తులు, సెట్‌లు, సంస్కృతి అన్ని ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది. విజయ్–రష్మిక జంటకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ మళ్లీ ఈ చిత్రంలో కనిపించనుంది. ఇక హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ అభిమానుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది.

ఇటీవల విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక మందన్న ఉదయపూర్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని ‘రణబాలి’ టీమ్ ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ వీడియోలో వివాహం అనంతరం ‘రణబాలి’ ఇంకా  జయమ్మ పాత్రల మధ్య ఉన్న మధురమైన క్షణాలను చూపించారు. ఈ గ్లింప్స్‌కు సంగీత దర్శకులు అజయ్–అతుల్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగాన్ని మరింత పెంచింది. ఈ ప్రత్యేక సర్‌ప్రైజ్‌తో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ సినిమాపై అంచనాలను మరింత పెంచారు. కథ, నిర్మాణం, నటీనటుల ఎంపిక అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘రణబాలి’ మూవీ 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *