ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఛీఫ్ సెక్రటరీ)గా జి.సాయి ప్రసాద్ నేడు ఏపీ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు సీఎస్ గా పని చేసిన కె.విజయానంద్ పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన నుండి సాయి ప్రసాద్ కొత్తగా బాధ్యతలు స్వీకరించారు.ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం మరియు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాల వేద పండితుల ఆశ్వీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఉ.11.33 గం.లకు సిఎస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ప్రత్యేక పలువురు కీలక ఉన్నతాధికారులు వివిధ శాఖాధిపతులు, రాష్ట్ర సచివాలయం సహా వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిథులు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభా కాంక్షలు తెలిపారు. అలాగే వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సీఎస్ సాయి ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ పట్టభద్రులు కాగా 1991 సెప్టెంబరు 15న ఐఏఎస్ కు ఎంపికై వివిధ హోదాల్లో సేవలందించారు.