వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది:వై.ఎస్.జగన్ 

Spread the love

ఏపీలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఉన్న బాణాసంచా తయారీ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం వై.ఎస్.జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలి. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *