సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఐదుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలించారు. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదం. మృతులకు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.