ఐసీసీ తాజా ర్యాంకింగ్స్..నెంబర్ వన్ గా కొనసాగుతున్న అభిషేక్ శర్మ 

Spread the love

తాజాగా విడుదలైన ఐసీసీ  టీ20 ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్లు తమ హవా కొనసాగిస్తూనే ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత  ప్లేయర్లే టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. అయితే, ఈ వారంలో జరగనున్న గేమ్స్ లో బాగా ఆడడం భారత ప్లేయర్స్ కు అత్యంత కీలకం. లేకపోతే ర్యాంకింగ్స్ పై  ప్రభావం పడుతుంది. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో  భారత స్టార్ హిట్టర్ అభిషేక్ శర్మ 874 పాయింట్లతో  తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ వరల్డ్ కప్ లో  అభిషేక్ కేవలం ఇప్పటివరకు ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. కీలక మ్యాచ్ లలో విఫలమయ్యాడు. ఇక అభిషేక్ వెనుకనే పాకిస్థాన్ ఓపెనర్ సహిబ్జాద ఫర్హాన్ 848 పాయింట్లతో ఉన్నాడు. శ్రీలంకపై సెంచరీతో రాణించడంతో అతని పాయింట్లు  భారీగా పెరిగాయి. ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడు నుంచి రెండులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ 803 పాయింట్లతో  మూడు స్థానానికి పడిపోయాడు. శ్రీలంక క్రికెటర్ పాతుమ్ నిశాంక 766 పాయింట్లతో ఉండగా..ఇషాన్ కిషన్ 783 పాయింట్లతో 4వ స్థానంలోకి వచ్చాడు. ఇక తిలక్ వర్మ 749 పాయింట్లతో 6వ ర్యాంకు చేరాడు. ఇక విండీస్ పై  97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి భారత్ ను విజయతీరాలకు చేర్చిన సంజు శాంసన్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 40వ ర్యాంకుకు చేరాడు. మరోవైపు బౌలర్ల ర్యాంకింగ్స్ లో వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ లు మంచి స్థానాల్లో నిలిచారు. వరుణ్ చక్రవర్తి 818 పాయింట్లతో  అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా జస్ప్రీత్ బుమ్రా 671 పాయింట్లతో 8 నుండి 7వ ర్యాంకుకు చేరాడు. అర్ష్ దీప్ సింగ్ 13వ ర్యాంకులో నిలిచాడు.ఆల్ రౌండర్ ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా (328) అగ్రస్థానంలో నిలిచాడు. భారత స్టార్ హార్దిక్ పాండ్య (284) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.  సైమ్ ఆయూబ్ (275) మూడో ర్యాంకుకు పరిమితమయ్యాడు. టాప్ 10లో భారత్ తరఫున పాండ్యతో పాటు శివమ్ దూబె 9వ ర్యాంకుతో నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *