భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Spread the love

ఈరోజు ట్రేడింగ్ ను దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగించాయి. నిన్న హోలీ సందర్భంగా మార్కెట్లు సెలవు తీసుకున్న తర్వాత, నేడు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుండి  అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మరియు ముడిచమురు (Crude Oil) ధరలు పెరగడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 1122 పాయింట్లు నష్టపోయి 79,116 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 385 పాయింట్ల నష్టంతో 24,480 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.92.09గా కొనసాగుతోంది. రంగాల వారీగా: మెటల్, పీ.ఎస్‌.యు బ్యాంక్, రియల్టీ, మరియు ఆటో రంగాలు నష్టపోయాయి. కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్ తదితర షేర్లు లాభపడ్డాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *