భూ రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

డోన్ నియోజకవర్గం, కొత్త బురుజులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం వల్ల రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసేసిందని విమర్శించారు.  డోన్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక సాధారణ రైతు భూమిని తన అనుచరులకు కట్టబెట్టేశారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం 1.95 కోట్ల ఎకరాలను 22ఏలో పెట్టారు. ప్రైవేట్ భూముల్ని ఇష్టానుసారంగా చేశారు. అడిగిన భూమి ఇవ్వకపోతే వాటిని 22ఏలో పెట్టేసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేట్ భూములపై అజమాయిషీని సొంత వాళ్లకు కట్టబెట్టాలని చూశారని ఆక్షేపించారు. అప్పీల్ కు వెళ్లడానికి వీలు లేకుండా చేయాలని చూశారన్నారు. ఇదే జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో పట్టాదారు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చాను. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని స్పష్టం చేశారు.  భూ రికార్డుల్లో తప్పులను సరిదిద్దుతున్నట్లు తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములు, సొంత శ్రమతో కొనుగోలు చేసిన భూములకు చెందిన పుస్తకాలపై ఫోటోలు వేసుకున్నారన్నారు. ఫోటోల పిచ్చితో జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారని గత పాలకులపై మండిపడ్డారు. సర్వే రాళ్లపైనా ఫోటోలు ముద్రించుకున్నారు… రూ.750 కోట్లు ఫోటోలకు ఖర్చు చేశారని విమర్శలు గుప్పించారు. తాను ఎక్కడెళ్లినా భూ సమస్యలపై కట్టకట్టలు అర్జీలు వచ్చాయన్నారు. వాళ్లు చేసిన ఒక దుర్మార్గాన్ని సరిదిద్దడానికి 20 నెలలు పట్టిందన్నారు. రైతుల సమక్షంలోనే భూ కొలతలు తీసుకుని రైతుల ఆమోదంతో భూ వివరాలతో పుస్తకాలు ఇస్తున్నట్లు తెలిపారు. భూ రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇస్తున్నట్లు వివరించారు. క్యూఆర్ కోడ్ విధానంతో ఎవరు రికార్డులు తారుమారు చేసినా తెలిసిపోతుందన్నారు. ఎమ్మార్వో, వీఆర్వోలు తప్పు చేసినా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుందని పేర్కొన్నారు. ఈ పట్టాదార్ పుస్తకాలను ట్యాంపర్ చేయలేరని రూపాయి అవినీతి లేకుండా కొత్త పట్టాదార్ పాసు పుస్తకాలు ఇస్తున్నామన్నారు.  గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకొస్తామన్న మా మాటను నమ్మి అధికారం ఇచ్చారు. నంద్యాల జిల్లాలో పార్లమెంట్ సహా 8 మందిని గెలిపించారు.సీమలో 7 సీట్లు తప్ప అన్నింటా కూటమి అభ్యర్థులను గెలిపించారు.ప్రజాహితం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.  గత ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలు, వివాదాలేనని మండిపడ్డారు. 30 వేల మంది కల్తీ మద్యం తాగి గత ప్రభుత్వంలో చనిపోయారు. ప్రజల జీవితాలు, ఆరోగ్యంతో ఆడుకున్నారని మండిపడ్డారు.తిరుమల లడ్డూలో వాడే నెయ్యిని కూడా కల్తీ చేశారని దుయ్యబట్టారు. ఇక ఒకప్పుడు సీమలో ముఠా నాయకులు ఉండేవారని ఎన్నికల సమయంలో డబ్బుల కంటే బాంబులు అడిగే పరిస్థితి ఉండేది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్బగ్యాలు ఉండకూడదని… ఈ ప్రాంతంలో ముఠా తగాదాలను నిర్ములించినట్లు తెలిపారు. గతాన్ని గుర్తు పెట్టుకుంటేనే భవిష్యత్ బాగుంటుందని డోన్ నియోజకవర్గంలో 30 చెరువులకు హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చామన్నారు. హంద్రీనీవాను ప్రారంభించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. సీమలో హంద్రీనీవా, నగరి గాలేరు, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే… వీటిని పూర్తి చేసే అదృష్టం దక్కిందన్నారు. భగీరథుని స్పూర్తితో సీమలో ప్రతీ ఎకరాకు నీళ్లివ్వాలనేది తన సంకల్పమని స్పష్టం చేశారు. అన్నీ రిజర్వాయర్లలో నీరు ఉండాలి.. పొలాలన్నీ పచ్చగా ఉండాలన్నారు. సీమను ఉద్యాన వనంగా చేస్తామన్నారు. రాయలసీమ ఉత్పత్తులను దేశ స్థాయికి పంపి, మెరుగైన వెరైటీస్ ఇక్కడికి తీసుకొస్తామన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *