ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో తాజాగా స్కాట్లాండ్ తో మ్యాచ్ (పూల్-బి)ను భారత్ 2-2తో డ్రాగా ముగించింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (18వ), సునెలిటా (29వ) చెరో గోల్ కొట్టారు. స్కాట్లాండ్ జట్టులో హెథర్ మెక్ఎ్వన్ (6వ), ఫియోనా బర్నెట్ (33వ) గోల్ చేశారు. చెరో రెండు గోల్స్ సాధించిన తరువాత టీమ్స్ పైచేయి కోసం ప్రయత్నించాయి. ఆఖరి క్వార్టర్ లో భారత్ అనేక పెనాల్టీ కార్నర్ లు సాధించినా, సరిగా వినియోగించుకోలేకపోయింది. భారత జట్టు నాలుగు పాయింట్లతో పూల్ లో టాప్ లో కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో 4-0తో ఉరుగ్వే పై గెలిచిన భారత్.. తర్వాతి మ్యాచ్ లో రేపు వేల్స్ తో తలపడనుంది. తాజాగా మరో పూల్-బి మ్యాచ్లో ఉరుగ్వే 3-2తో వేల్స్ పై విజయం సాధించింది. పూల్-ఎలో ఇంగ్లాండ్ 3-0తో కొరియాపై, ఇటలీ 3-0తో ఆస్ట్రియాపై పూల్-ఎలో ఇంగ్లాండ్ 3-0తో కొరియాపై, ఇటలీ 3-0తో ఆస్ట్రియాపై విజయం సాధించాయి.