ఈనెల 13 నుండి అఫ్గానిస్థాన్, శ్రీలంకల మధ్య షార్జా వేదికగా మూడు టీ20లు, మార్చి 20, 22, 25 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్లు జరగాల్సి ఉండగా…తాజాగా మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడప్పుడే ఈ సిరీస్ నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో సైతం పలు జట్లు ఫ్లైట్స్ రాకపోకల్లో అంతరాయం వల్ల స్వదేశాలకు చేరుకోవడంలో పలువురు ఇబ్బంది పడిన సంగతి విదితమే. ఇక షెడ్యూల్ ప్రకారం మార్చి 13 నుంచి 25 వరకు శ్రీలంక, అఫ్గానిస్థాన్ల మధ్య దుబాయ్ వేదికగా వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మిడిల్ ఈస్ట్ లో వార్ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఆ సిరీస్ రద్దయినట్లు వార్తలు వస్తున్నాయి.