ఎల్.పీ.జీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు పెంచుతూ కీలక నిర్ణయం

Spread the love

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికి దేశంలో తగినంత నిల్వలు ఉన్నట్లు చెబుతున్నాయి. ఇక తాజాగా గ్యాస్ సిలిండర్ల బుకింగ్ గడువును మాత్రం పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్ సిలిండర్ కు మధ్య ఉన్న బుకింగ్ సమయాన్ని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సిలిండర్లకు రానున్న రోజుల్లో కొరత ఉండొచ్చనే ఉద్దేశంతో కొందరు ముందస్తుగా బుకింగ్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ ధరను ఇటీవల కేంద్రం రూ.60 పెంచిన సంగతి తెలిసిందే. కమర్షియల్ అవసరాలకు వినియోగించే సిలిండర్ పై రూ.114.5 పెంచింది. ఇక గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్.పీ.జీ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని కమర్షియల్ కంటే గృహ వినియొగదారులకే అధిక ప్రాధాన్యత అందించాలని కేంద్రం రిఫైనరీలకు సూచించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *