ఈరోజు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో అనే సందిగ్దతకు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 1,342 పాయింట్లు పడిపోయి 76,863 వద్ద స్థిరపడగా..నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 394 పాయింట్లు నష్టపోయి 23,867 వద్ద స్థిరపడింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.92.06గా కొనసాగుతోంది. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.5 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. మిడిల్ ఈస్ట్ పరిస్థితులు ప్రభావం చూపాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు మొదలయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్ మరియు ఆటో రంగాలు ఎక్కువగా నష్టపోయాయి, ఫార్మా మరియు ఎనర్జీ రంగాలు మాత్రం కొంతమేర పర్వాలేదనిపించాయి.