కేరళలో ప్రధాని మోడీ పర్యటన..కాంగ్రెస్,లెఫ్ట్ పార్టీలపై విసుర్లు

Spread the love

ప్రధాని నరేంద్రమోడీ నేడు కేరళలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మీరు కాంగ్రెస్‌కు మరియు లెఫ్ట్ పార్టీలకు 70 ఏళ్లకు పైగా సమయం ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి బీజేపీ ఎన్డీయే కి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. బీజేపీ వస్తే ‘వికసిత కేరళం’ యొక్క అద్భుతమైన రూపాన్ని చూస్తారని పేర్కొన్నారు. దీనికి మోదీ గ్యారెంటీ అని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతంలోని పరిస్థితుల గురించి మాట్లాడారు. మన సోదర సోదరీమణులు లక్షలాది మంది అక్కడ పనిచేస్తున్నారు.కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్నది BJP-NDA ప్రభుత్వం అని మీరు గుర్తుంచుకోవాలి. మన పౌరులు ఏ దేశంలోనైనా ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు, వారిని ఆదుకోవడానికి కృషి చేస్తామని భరోసానిచ్చారు. ఇరాక్‌లో నర్సులను రక్షించడం నుంచి నేటి భారత్ సంక్షోభ సమయాల్లో తన పౌరులను ఒంటరిగా వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ఒకవైపు దేశాన్ని ఆత్మనిర్భర భారత్‌గా తీర్చిదిద్దేందుకు బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని అయితే  మరోవైపు, కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీల వారు ‘ఆత్మనిర్భర భారత్’ అభియాన్‌ను ఎగతాళి చేయడంలోనే నిమగ్నమై ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలు కలిసి ప్రభుత్వాలను నడిపాయి. వీరు మన దేశాన్ని విదేశాలపై ఎక్కువగా ఆధారపడేలా చేశారు.నేడు ఈ పార్టీలన్నీ కలిసి వదంతులు వ్యాప్తి చేయడంలో నిమగ్నమయ్యాయి. యుద్ధ కాలంలో కూడా, దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్-లెఫ్ట్ మరియు వాటి ఎకోసిస్టమ్ తమ శక్తినంతా ధారపోస్తున్నాయి. కాంగ్రెస్-లెఫ్ట్ వ్యాప్తి చేస్తున్న ఇటువంటి వదంతుల పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని నేను దేశ ప్రజలను కోరుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *