దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ట్రేడింగ్ లో వారం చివరి రోజైన నేడు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో నష్టాల బాట పట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు పతనమై 74,563.92 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 488.05 పాయింట్లు కోల్పోయి 23,151.10 వద్ద ట్రేడింగ్ ముగించింది. ఇరాన్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయికి అంటే 92.37గా కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్మెంట్స్ ను భారీగా ఉపసంహరించుకోవడం కూడా మార్కెట్ పతనానికి దారితీసింది. మెటల్, PSU బ్యాంక్, ఆటో, మరియు ఎనర్జీ రంగాలు భారీగా నష్టపోయాయి. కాగా, హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) మరియు భారతీ ఎయిర్‌టెల్ వంటి కొన్ని షేర్లు మాత్రమే స్వల్ప లాభాల్లో నిలిచాయి.