నేడు రంజాన్ పండుగను పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశం. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుంది. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ…. ఈద్ ముబారక్ అంటూ చంద్రబాబు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
మంత్రి నారా లోకేష్:
నెలవంక కనిపించింది. నెలంతా కఠోర దీక్ష చేసిన ప్రతి మోము మురిసింది. ఉపవాస దీక్షతో పొందిన ఉపదేశం శాంతి, కరుణ, దానం ప్రతి మది నుంచి సమాజానికి చేరింది. శాంతి, సుహృద్భావం వెల్లివిరిసింది. రంజాన్ పండుగ మీ కుటుంబాల్లో ఆనందాలు నింపాలని, ఆ అల్లాహ్ మిమ్మల్ని చల్లగా చూడాలని, ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను.