వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ ర్యాంకింగ్స్ లో ఐపీఎల్ కు మూడో ర్యాంకు 

Spread the love

భారీ స్థాయిలో ఆదాయం, వ్యూస్ పరంగా అత్యున్నత ఎంటర్టైనింగ్ క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్   టీ20 లీగ్ కు  వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ (WCA) మూడో ర్యాంకు ఇవ్వడంపై  భారత క్రికెట్ అభిమానులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అటు  సోషల్ మీడియాలో కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ లో ఒక క్రికెటర్ తీసుకునే సంపాదనలో కనీసం పోలిక కూడా లేని ది హండ్రెడ్ లీగ్ కు నెంబర్ వన్ స్థానం లభించింది. ఇటీవల ముగిసిన ది హండ్రెడ్ లీగ్ వేలంలో అత్యధిక వెల పలికిన  క్రికెటర్ కు దక్కిన మొత్తం రూ.4.81 కోట్లు. అదే ఐపీఎల్ లో  అయితే రూ.25 కోట్ల పైమాటే. కామెరూన్ గ్రీన్ కు  కోల్ కతా నైట్ రైడర్స్ రూ.25.20 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా  వేదికగా జరిగే ఎస్ఏ20 లీగ్ కూ ర్యాంకింగ్స్ లో  రెండో స్థానం ఇచ్చింది. ఇది కూడా ఐపీఎల్ తో పోలిస్తే  అంతంత మాత్రం లీగే.  అయితే ర్యాంకులను ప్రకటించేందుకు డబ్ల్యూసీఏ కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంది. వాటిని పరిశీలించి 100 పాయింట్లకు ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించింది. ప్లేయర్ల ఆదాయం, సెక్యూరిటీ, రైట్స్, ప్రొఫెషనల్ స్టాండర్డ్స్.. ఇలాంటివాటిని ఎంచుకొని పాయింట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. ప్లేయర్లు, వారి అసోసియేషన్లు, ఏజెంట్ల నుండి  సర్వే ఫీడ్ బ్యాక్ తీసుకొని ర్యాంకులను ప్రకటించింది.

1.ది హండ్రెడ్ – 75.2      2. ఎస్.ఏ 20 – 68.0 3.ఐపీఎల్ – 62.6 4.బిగ్ బాష్ లీగ్ – 62.5  5.పీఎస్ఎల్ – 48.0   6.మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) – 43.0 7.ఐ.ఎల్ టీ 20 – 39.1     8.సీ.పీ.ఎల్-38.9 9.అబుదాబి టీ10-30.1  10.బీ.పీ.ఎల్-22.6.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *