శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీకోసం” కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి పాల్గొన్నారు. రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల పక్షాన నిలిచే కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, నాయకులు కలిసి పని చేయడం వల్ల సమన్వయం పెరిగి సాగునీరు, కాలువలు, నీటి పంపిణీ వ్యవస్థల అభివృద్ధికి మరింత వేగం వస్తుంది అని తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలతో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో రైతులకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వ్యవసాయ అధికారులు, కూటమి శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు.