పరీక్షల్లో పాస్ చేయాలని కోరుతూ ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “సార్.. మీ కాళ్ళు మొక్కుతా, నన్ను పాస్ చేయండి” అంటూ ఆ విద్యార్థి తన ఆవేదనను వెళ్లగక్కారు. తనకు తల్లిదండ్రులు లేరని, టీచర్నే తన అమ్మనాన్నగా భావిస్తున్నానంటూ ఎమోషనల్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పరీక్ష కోసం చదువుకున్నవన్నీ మర్చిపోయానని, అందుకే తనను దేవుడిలా కాపాడాలని కోరుతూ, సమాధాన పత్రంలో కాళ్లు పట్టుకుంటున్నట్లు ఒక బొమ్మ వేసి మరీ తన విన్నపాన్ని అందులో వివరించారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినా చక్కగా చదువుకోకుండా ఇలాంటి పనులు ఏంటి అని కొందరు విమర్శిస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.