నెల్లూరు పలు లాడ్జిలపై ఏఎస్పీ మెరుపు దాడులు: పట్టుబడ్డ విటులలో బీటెక్ చదివే విద్యార్థులు 

Spread the love

చదువుకోవాల్సిన స్టూడెంట్స్ కూడా పెడదారిన పడుతూ అడ్డదారులు తొక్కడం కలవరపెడుతోంది. సమాజంలో రోజురోజుకు వెలుగు చూస్తున్న ఇటువంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెల్లూరు నగరంలోని పలు లాడ్జిలపై ఏఎస్పీ దీక్ష తన టీమ్ తో కలిసి మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏకంగా 15 మంది  మహిళలు.. 21 మంది వీటులు అరెస్ట్ అయ్యారు.  నగరంలోని నడిబొడ్డున ఇంత దారుణం జరగటం పట్ల నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మెరుపు దాడులతో అసభ్యకర  పనులు బయటపడ్డాయి.  పట్టుబడ్డ విటులలో బీటెక్ చదివే స్టూడెంట్స్  ఉండటం ఆందోళనకర అంశం. దీంతో కిందిస్థాయి సిబ్బందిపై ఏఎస్పీ దీక్ష తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరుగుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు.  విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నవంటూ సదర మహిళపై ఏఎస్పి దీక్ష తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. డబ్బులు కోసం లాడ్జిల నిర్వహకులు ఇలాంటి నీచమైన పనులకి ఒడిగట్టడం పట్ల ప్రజలు నుండి కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెంటనే సంబంధిత పోలీస్ అధికారులు పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అలాగే డైరెక్ట్ గా లాడ్జిలు తనిఖీ చేసి యువతులను విటులను పట్టుకున్న ఏఎస్పీ దీక్షను నగర ప్రజలు అభినందిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *