యథావిధిగా ఆర్డీటీ సేవలు:మంత్రి నారా లోకేష్

Spread the love

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయిందని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. లక్షలాది మంది సంతోషించే సమాచారమని ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.  ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)‌‌‌‌‌‌‌ సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో వెలుగు.. నిరుపేద పిల్లల చదువు.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించినట్లు తెలిపారు. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయని  ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులందరికీ  కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల సేవాస్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ గారికి అభినందనలు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *