విజయవాడ పాతబస్తీలో కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ముగ్గురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కొన్ని గంటలపాటు నిందితులను విచారించారు. సోషల్ మీడియా లో పోస్టులపై విచారణ సాగుతున్నట్లు సమాచారం. ప్రత్యేక బృందాలు సాంకేతిక నిపుణుల నేతృత్వంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో నిషేధిత వీడియోలు సోషల్ మీడియా లో వీడియోస్ పోస్టింగ్ వంటి వాటిపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న యువకులని టాస్క్ఫోర్స్ కార్యాలయంకు పోలీసులు తరలించారు. ఈరోజు రాత్రి పూర్తిగా విచారించి తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.