పాకిస్థాన్‌ను వణికిస్తున్న ‘ధురంధర్-2’

Spread the love

ఒక సినిమా సరిహద్దులు అవతల ఉన్న చిరకాల ప్రత్యర్థి దేశాన్ని కుదుపు కుదిపింది. భారతీయ సినిమా ‘ధురంధర్-2’ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు ఈ సినిమాలో చూపించిన అంశాలు పాక్ ప్రభుత్వాన్ని, గూఢచారి సంస్థలను ఉలిక్కిపడేలా చేశాయి. నిజంగానే భారత ఏజెంట్లు ఏ  వేషంలో ఉంది తమ దేశ రహస్యాలను సేకరిస్తున్నారా అన్న అనుమానంతో పాక్ పోలీసులు రోడ్లపైకి రావడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘ధురంధర్-2’.. ఇప్పుడు ఈ పేరు వింటేనే సరిహద్దు అవతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  ఒక సినిమా ఏకంగా ఒక దేశ రక్షణ వ్యవస్థనే వణికించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. భారత గూఢచారుల వీరగాథగా తెరకెక్కిన ఈ చిత్రం, పాకిస్థాన్‌ లో ఒక రకమైన ఆందోళన సృష్టించింది. సినిమాలో చూపించిన సీన్లు చూసి, నిజంగానే తమ వీధుల్లో భారత ఏజెంట్లు తిరుగుతున్నారేమోనన్న భయంతో పాక్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

మన భారతీయ సినిమాల్లో  స్పై థ్రిల్లర్లు రావడం కొత్తేమీ కాదు. అయితే  ‘ధురంధర్-2’ సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం ఇప్పటివరకు చూడని విధంగానే ఉంది. ఈ సినిమాలో దర్శకుడు చూపించిన అత్యంత వాస్తవిక గూఢచారి పద్ధతులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ప్రధానంగా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, లాహోర్ వంటి కీలక నగరాల్లో భారత ఏజెంట్లు అత్యంత దయనీయ స్థితిలో, భిక్షాటన చేస్తూ.. అక్కడి వ్యూహాత్మక సమాచారాన్ని భారత్‌ కు చేరవేస్తున్నట్లు చూపించిన సీన్లు పాక్ అధికారుల మైండ్ బ్లాక్ చేశాయి.సినిమాలో చూపించిన కొన్ని డ్రోన్ షాట్లు, లోకేషన్లు పాక్ భద్రతా వలయాలను పోలి ఉండటంతో  అది కేవలం సినిమాటిక్ కల్పితమేనా లేక నిజంగానే క్షేత్రస్థాయిలో జరుగుతున్న తతంగమా అనే అనుమానం అక్కడి పాలకులకు మొదలైంది. సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే పాకిస్థాన్‌ లోని సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ‘ఒకవేళ భారత్ నిజంగానే ఈ పద్ధతిని అనుసరిస్తే పాక్  భద్రతా లోపాలు ఏంటి?’ అనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో మేల్కొన్న పాక్ ప్రభుత్వం.. ఆ దేశంలోని ప్రధాన కూడళ్లు, సైనిక స్థావరాల పరిసరాల్లో ఉండే భిక్షగాళ్లపై ఆకస్మిక దాడులు ప్రారంభించింది. వందలాది మందిని అదుపులోకి తీసుకుని వారి ఐడెంటిటీ కార్డులను, వారు ఎక్కడి నుండి వచ్చారు అనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒక కల్పిత కథ ఆధారంగా ఒక దేశం మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేపట్టడం అంతర్జాతీయ గూఢచారి చరిత్రలోనే ఒక అరుదైన సంఘటనగా నిలిచిపోయింది. కేవలం భిక్షగాళ్లే కాదు, వీధి వ్యాపారులు, పారిశుద్ధ్య కార్మికులుగా ఎవరైనా ఏజెంట్లు చొరబడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. పాకిస్తాన్ వీధుల్లో ఇప్పుడు మునుపెన్నడూ లేని ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా అక్కడ పోలీసులు సాధారణ నేరస్థుల కోసం కాకుండా.. గూఢచారుల కోసం వేట మొదలుపెట్టారు. ఈ గూఢచారుల వేటలో భాగంగా పాక్ పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రభుత్వ కార్యాలయాల వద్ద భిక్షాటన చేస్తున్న వారిని తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రతి ఒక్కరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా, ఒక కల్పిత కథ పాకిస్తాన్ లాంటి దేశాన్ని వణికించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది.  వాస్తవికతకు దగ్గరగా ఉండే సన్నివేశాలు, గతం లోని చేదు అనుభవాలు వెరసి పాకిస్థాన్‌ను ఒక రకమైన ‘అయోమయం’ లోకి నెట్టేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *