LPG రీఫిల్ బుకింగ్ పై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. LPG రీఫిల్ బుకింగ్ సమయాలలో LPG రీఫిల్ బుకింగ్ నిబంధనలలో మార్పులు వచ్చినట్లు సోషల్ మీడియా మరియు వార్తా సంస్థల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. రీఫిల్ బుకింగ్ నిబంధనలలో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. రెండు బుకింగ్‌ల మధ్య ఉండాల్సిన కనీస గడువు:– పట్టణ ప్రాంతాల్లో: 25 రోజులు– గ్రామీణ ప్రాంతాల్లో: 45 రోజులు అని పేర్కొంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారమే ఈ కాలపరిమితులు కొనసాగుతాయని వెల్లడించింది. దయచేసి ఆందోళనతో ముందస్తు బుకింగ్ చేయవద్దని వినియోగదారులను కోరింది. డిమాండ్‌కు సరిపడా LPG నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది.