భారత క్రికెట్ కు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చి సంక్షోభ సమయంలో టీమ్ ను నడిపించి ఇప్పటికీ 90’s కిడ్స్ కు కెప్టెన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరుగా నిలిచిన దిగ్గజం సౌరవ్ గంగూలీ. ఈ మాజీ దిగ్గజం తన తరువాత ఆ స్థాయిలో భారత క్రికెట్ ను అత్యున్నత శిఖరాలకు చేర్చిన మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. గంగూలీ కెప్టెన్ గా ఉన్నప్పుడే ధోనీ భారత క్రికెట్ లోకి వచ్చాడు. కాగా, తాజాగా గంగూలీ ధోనిని ప్రశంసల్లో ముంచెత్తాడు. యువ ధోనీ అంటే తనకు బాగా ఇస్తామని ‘భారత్ తరపున అత్యుత్తమ ‘వైట్ బాల్ కెప్టెన్’ గా ధోనిని అభివర్ణించాడు. స్ట్రాటజీల పరంగా అతనికి తిరుగులేదని పేర్కొన్నాడు. ధోని కెప్టెన్సీలో భారత్ వన్డే వరల్డ్ కప్ గెలిచింది. టీ 20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. నా కెప్టెన్సీలో రన్నరప్ గా నిలిచాం. మా అప్పుడు టీ 20 క్రికెట్ లేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్ కప్ మాత్రమే ఉండేవి. అయితే ధోనీ రెండు ఫార్మాట్ లలో భారత్ ను విశ్వవిజేతగా నిలిపాడు. అందుకే అతడు వైట్ బాల్ క్రికెట్ లో అత్యుత్తమ కెప్టెన్ అని కొనియాడాడు. జార్ఖండ్ వంటి ప్రాంతం నుండి వచ్చి లెజెండ్ గా నిలిచాడు. అదివరకు అక్కడి నుండి వచ్చి భారత్ కు ప్రాతినిథ్యం వహించనవారు లేరు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ అందుకు ఉదాహరణ. వైభవ్ బిహారీ అయినప్పటికీ చిన్నప్పటి నుండి ధోనిని చూస్తూ పెరిగాడని అన్నాడు.