షేన్ వార్న్ ముందుచూపు.. కుటుంబానికి రూ.460 కోట్లు!

Spread the love

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కుటుంబానికి కోట్లాది రూపాయలు సమకూరనున్నాయి. అతను దార్శనికతతో చేసిన పని అతని కుటుంబానికి కాసులు కురిపించనుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాయల్స్ ను అమ్మకంతో దాదాపు రూ.460 కోట్లు దక్కనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో వార్న్ కు ఉన్న 3 శాతం వాటా విలువ అది. రాజస్థాన్ ప్రస్తుత ఓనర్లు ఆ టీమ్ ను రూ.15,300 కోట్లకు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ పూర్తైన తరువాత బీసీసీఐ ఒప్పందాన్ని అంగీకరించడంతో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. షేన్ వార్న్ మొట్ట మొదటి ఐపీఎల్ ను గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఫ్రాంచైజీతో ఒప్పందంలో భాగంగా వార్న్ కు ఆడిన ప్రతి సీజన్ లో యాజమాన్యంలో 0.75 శాతం వాటా ఇవ్వాల్సి ఉంది. నాలుగేళ్ల పాటు వార్న్ ఆ టీమ్ కు కెప్టెన్ గా మెంటర్ గా ఉన్నాడు. దీంతో అతనికి 3 శాతం వాటా దక్కింది. అదే ఇప్పుడు వార్న్ కుటుంబానికి అంత డబ్బు లభించేందుకు కారణమైంది. వార్న్ 2022 లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *