నేడూ భారీ లాభాల్లోనే దేశీయ మార్కెట్లు..!

Spread the love

అంతర్జాతీయ సానుకూల పరిణామాలకు తోడు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి కనబరచడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముడి చమురు ధరల తగ్గుదల మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు మార్కెట్లకు కలిసొచ్చాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ సుమారు 1,205 పాయింట్లు పెరిగి 75,273 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 394 పాయింట్లు లాభపడి 23,306 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.93.84గా కొనసాగుతోంది.  అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల  దిగువకు చేరడం మార్కెట్‌ కు ఉపశమనానిచ్చింది. బ్యాంకింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ మరియు పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు లాభాల బాటపట్టాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *