ఇటువంటి అరాచకాలను ఆదిలోనే ఆపాలి:డిప్యూటీ స్పీకర్ రఘురామ

Spread the love

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆకివీడు పెదపేటలోని రామాలయానికి రామ భక్తులతో కలిసి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు వెళ్లారు. దళిత ముసుగులో ఉన్న అన్యమతస్థులు  తాను రాముల వారిని దర్శనం చేసుకుంటున్న సమయంలో పెద్దగా కేకలు వేసి, ఆయన  అక్కడి నుండి బయలుదేరిన వెంటనే ఆలయం వద్ద ఉన్న రామ భక్తులపై కత్తులతో దాడి చేసి చాలా మందిపై హత్యా ప్రయత్నం చేశారని తెలిపారు. ఇటీవల గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  హిందువుల పండుగ రోజున, హిందూ దేవాలయంలో హిందువులపై ఈ దాడులు చేయించిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని రఘురామ స్పష్టం చేశారు. రామాలయం వద్ద జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి భీమవరం హాస్పిటల్ లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షత గాత్రులను ఆయన పరామర్శించారు. వీరిలో ఒక వ్యక్తికి తలలో మేకు గుచ్చుకుందని మరొక వ్యక్తి సుమారు 12 చాకు పోట్లకు గురయ్యాడని తెలిపారు.  ఇటువంటి అరాచకాలను ఆదిలోనే ఆపాలి. ఘటనపై ఆరాతీసి చర్యలకు ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *