ఉండి నియోజకవర్గం ఆకివీడు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామనవమి సందర్భంగా అక్కడ ఉన్న పురాతన ఆలయానికి పూజకు వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ కే రఘు రామకృష్ణ రాజు పై, కూటమి నాయకులపై కొందరు దాడి చేయడాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన రామాలయ పునరుద్ధరణకు పూనుకున్న డిప్యూటీ స్పీకర్ పూజలకు వెళ్లిన సమయంలో, బయటి వ్యక్తులతో కలిసి కొంతమంది ఆయుధాలతో దాడికి పాల్పడడం గర్హనీయమన్నారు. భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాల్సిన పవిత్ర సమయంలో ఇటువంటి సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని ఈ రోజు జరిగిన దాడిలో కొందరు గాయపడి ఆసుపత్రి పాలవ్వడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యహరించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.