మెగా చెల్లెలి నిర్మాణం లో అన్న వరుణ్ సినిమా

Spread the love

హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ను ఆయన సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు.  తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. అలాగే అనౌన్స్మెంట్ సమయం లోనే ఈ సినిమాకు బరి అనే ఆసక్తికరమైన టైటిల్‌ను కూడా ప్రకటించారు. ఈ సినిమా లాంచ్ ఈవెంట్ కూడా ఘనంగా  జరిగింది. తాజాగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన స్వయంగా ఈ సినిమా ప్రారంభానికి క్లాప్ కొట్టి అధికారికంగా లాంచ్ చేశారు. పవన్ కళ్యాణ్ పాల్గొనడం వల్ల ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది.

మెగా కుటుంబ సభ్యులు, సినిమా యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సినిమా ప్రారంభం కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కథ, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వంటి విషయాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.  ఈ చిత్రాన్ని దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇంతకముందు ఆయన డైరెక్ట్ చేసిన కమిటీ కుర్రోళ్లు సినిమా మంచి విజయాన్ని సాధించింది. క్రీడా నేపథ్యమున్న ఈ సినిమాను పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *