అమరావతిపై తీర్మానం..అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలనే అంశంపై తీర్మానం చేసేందుకు ఈరోజు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. కాగా, సభ ప్రారంభం కాగానే ఏపీ సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఆమోదించిన అనంతరం ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. ఇక శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని నిర్మాణం అవసరమని సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు. ఆ 11 మంది ఈరోజైనా వస్తారని ఆశించినట్లు వైసీపీ సభ్యులనుద్దేశించి పేర్కొన్నారు.రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని 2015 జనవరి లో  ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్ ఇచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఫిబ్రవరికి 29 వేల మంది రైతులు 34,400 ఎకరాలను ఇచ్చారని వైసీపీ నేతలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *