ఇరాన్ కు కీలకమైన ‘ఖర్గ్ ద్వీపం’ ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు కాబోతోందా? అసలు ఏముంది ఆ ద్వీపంలో? ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ స్పందన ఎలా ఉండబోతోంది? ఇరాన్ దేశం వైశాల్యపరంగా పెద్దదే కానీ ఆ దేశం బతుకుతున్నది మాత్రం పర్షియన్ గల్ఫ్‌లోని ఒక చిన్న చుక్క లాంటి దీవి వల్ల. అదే ‘ఖర్గ్ ద్వీపం’. హార్ముజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉండే ఈ దీవి నుంచి ఇరాన్ తన మొత్తం చమురు ఎగుమతుల్లో 90 శాతాన్ని నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచే నౌకలు చమురును నింపుకుని అరేబియా సముద్రం మీదుగా ప్రపంచ దేశాలకు వెళ్తాయి. అందుకే ఇది ఇరాన్ పాలిట ఒక ‘డైమండ్’ గా చెబుతుంటారు. ఇప్పుడు అమెరికా ఈ చిన్న దీవిపై ఎందుకు ఫోకస్ చేస్తోంది? దీని వెనుక బలమైన ఆర్థిక వ్యూహం ఉంది. ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ రెవెన్యూపై ఆ ప్రభావం పడుతుంది. అందుకే ట్రంప్ ఆ దిశగా ఆలోచిస్తున్నారు. కేవలం 8 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఒక చిన్న భూభాగం ఇరాన్ కు ఇప్పుడు ఒక ‘డైమండ్’ లాంటిది. ఆకాశం నుండి చూస్తే సముద్రంలో ఒక చిన్న చుక్కలా కనిపించే ఈ దీవి, ఇరాన్ చమురు వాణిజ్యంలో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తోంది. పర్షియన్ గల్ఫ్‌లో లోతైన నీటి మట్టం ఉన్న ప్రాంతంలో ఈ ద్వీపం ఉంది. దీనివల్ల ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ట్యాంకర్లు సులభంగా ఇక్కడికి వచ్చి చమురును లోడ్ చేసుకోగలవు. సాధారణ తీర ప్రాంతాల్లో ఇంత లోతు ఉండదుఇటీవల ఈ దీవిపై అమెరికా వైమానిక దాడులు చేసింది. అయితే చమురు ఉత్పత్తి కేంద్రాల జోలికి వెళ్లలేదు. ఇరాన్ సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేసింది.అయితే . తాము తలచుకుంటే ఈ దీవి జోలికి కూడా వెళ్లగలం అనే సంకేతాలు ఇచ్చింది. ఇక ఈ దాడి తర్వాత ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. గల్ఫ్ లోని అమెరికా మిత్ర దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది. ఇప్పుడు ట్రంప్.. దాదాపు 10వేల మంది సైనికుల్ని ఇరాన్‌పై భూతల దాడులకు పంపబోతున్నరనే వార్త కలకలం రేపుతోంది. ముందుగా 3,500 మంది రెడీగా ఉన్నారని రాయిటర్స్, అల్ జజీరా లాంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి.ట్రంప్ ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “మేము ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఇది చాలా సులభం. మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయని అన్నారు. ట్రంప్ ఖర్గ్ దీవిపై దాడులు లేదా.. గ్రౌండ్ ఫోర్స్‌తో యుద్ధానికి దిగితే దానికి ఇరాన్ కూడా తీవ్రంగా బదులిస్తుంది. ఎందుకంటే ఈ దీవి ఇరాన్ కి ఆ స్థాయిలో కీలకం. దీనిని కోల్పోతే ఆర్థికంగా ఆ దేశం మరింత చితికిపోతుంది. కాబట్టి ఇరాన్ ధీటుగా బదులిస్తుంది. అది మరింత పెద్ద యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇరాన్ హార్ముజ్ జలసంధిపై పట్టువీడడం లేదు. దాన్ని తెరిపించాలంటే ఖర్గ్ దీవిని సొంతం చేసుకొని హార్ముజ్ జలసంధిని తెరిస్తేనే, ఖర్గ్ దీవిని వెనక్కి ఇస్తాం అని అమెరికా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.అదే జరిగితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గదు. అయితే అంత తేలిగ్గా అమెరికాకి ఆ దీవిని అప్పగిస్తుందని అనుకోలేం. ముందుగా చెప్పుకున్నట్లుగా ఖర్గ్ ద్వీపం కేవలం ఒక భూభాగం మాత్రమే కాదు, అది ఇరాన్ జేబులో ఉన్నఏటీఎం లాంటిది. అది ఆగిపోతే ఆ దేశానికి వచ్చే డాలర్ల రాబడి ఆగిపోతుంది. ఇరాన్ ఆల్రెడీ 10 లక్షల మంది సైన్యాన్ని యుద్ధానికి రెడీ చేసుకుంటోంది. అమెరికా వార్ ఫీల్డ్ లో యుద్ధానికి దిగితే, ఖర్గ్ దీవిని టచ్ చేస్తే ఇరాన్ ఏ స్థాయిలో స్పందిస్తుందనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న టెన్షన్. ట్రంప్ ఏప్రిల్ 6 వరకూ యుద్ధానికి విరామం ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఇది ఏ విధంగా కొనసాగుతుందో అనే ఆందోళన ప్రపంచమంతటా ఉంది.