అమరావతి అభివృద్ధి ఓర్వలేకే వైసీపీ విమర్శలు:మంత్రి నారాయణ

Spread the love

అమరావతిలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని జీర్ణించుకోలేక, ప్రతిపక్షాలు నిరాధారమైన ప్రచారానికి ఒడిగడుతున్నాయని మంత్రి నారాయణ విమర్శించారు.  బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి, మరియు ధర్మాన ప్రసాదరావు వంటి నాయకులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాజధాని కోసం 30,000 ఎకరాలు అవసరమని అసెంబ్లీలో చెప్పిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మాట తప్పి, మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి భూములిచ్చిన రైతులకు ద్రోహం చేశారని విమర్శించారు.  దీనిపై ఆయన తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. రైతులను అణచివేసిన ఆ చీకటి రోజులు ముగిశాయని నేడు సీఎం చంద్రబాబు  నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు.  ప్రపంచ బ్యాంక్ మరియు ADB నుండి ₹15,000 కోట్లు, HUDCO నుండి ₹11,000 కోట్లు, మరియు నాబార్డ్ (NABARD) నుండి ₹7,500 కోట్లు సమీకరించి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీరికి తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *