వార్ ప్రభావం..ఎక్కువ రోజులు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన దేశంగా ఇరాన్

Spread the love

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తమ దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. నెల రోజులకు పైగా ఇంటర్నెట్ పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ నెట్ బ్లాక్స్ అంచనా ప్రకారం 864 గంటల పాటు నిరంతరాయంగా ఈ సర్వీసెస్ నిలిపివేసిన దేశంగా ఇరాన్ నిలిచింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే.  అప్పటి నుండి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ నిలిపివేసింది. అయితే పలు దేశాల్లో వివిధ సంక్షోభ సందర్భాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినప్పటికీ ఇన్ని రోజులపాటు ఏ దేశమూ ఆంక్షలు కొనసాగించలేదని తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్త ఇంటర్నెట్ షట్‌డౌన్‌లలో ఇరాన్ సరికొత్త రికార్డును సృష్టించింది. అక్కడ తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో వరుసగా 37 రోజుల పాటు దాదాపు పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, గత రికార్డులను అధిగమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *