దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల జోష్ తో మార్కెట్లు దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ సుమారు 787 పాయింట్లు లాభపడి 74,106 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 22,968 వద్ద స్థిరపడింది. మార్కును అధిగమించింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.93.02గా కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాలకు తోడు రూపాయి బలపడటం మరియు బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో భారీ కొనుగోళ్లు మార్కెట్ లాభాలకు ఊతమిచ్చాయి. సెన్సెక్స్ 30లో ట్రెంట్, టైటాన్, యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. బ్యారెల్ చమురు 108 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బీ.ఎస్.ఈ లో నమోదిత కంపెనీల విలువ పెరిగింది. ఇక మార్కెట్ ప్రస్తుతం సానుకూల ధోరణిలో ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పరిణామాలు మరియు ముడి చమురు ధరల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.