మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తమ దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. నెల రోజులకు పైగా ఇంటర్నెట్ పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ నెట్ బ్లాక్స్ అంచనా ప్రకారం 864 గంటల పాటు నిరంతరాయంగా ఈ సర్వీసెస్ నిలిపివేసిన దేశంగా ఇరాన్ నిలిచింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ నిలిపివేసింది. అయితే పలు దేశాల్లో వివిధ సంక్షోభ సందర్భాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినప్పటికీ ఇన్ని రోజులపాటు ఏ దేశమూ ఆంక్షలు కొనసాగించలేదని తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్త ఇంటర్నెట్ షట్డౌన్లలో ఇరాన్ సరికొత్త రికార్డును సృష్టించింది. అక్కడ తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో వరుసగా 37 రోజుల పాటు దాదాపు పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, గత రికార్డులను అధిగమించింది.