భారీ లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫుల్ జోష్..!

Spread the love

అంతర్జాతీయ సానుకూల పరిణామాలకు తోడు కీలక షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ సుమారు2,946  పాయింట్లు లాభపడి 77,562 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 873 పాయింట్ల లాభంతో 23,997 వద్ద స్థిరపడింది. మార్కును అధిగమించింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.92.35గా కొనసాగుతోంది. మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతానికి యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే విధంగా అమెరికా ఇరాన్ ల కాల్పుల విరమణ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. అలాగే కీలక వడ్డీరేట్లను ఆర్.బీ.ఐ యాతథంగా ఉంచడం కూడా కలిసొచ్చింది. ఇక ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీ.ఎస్.ఈ లో సంపద రూ.15లక్షల కోట్లు పెరిగి రూ.445 లక్షల కోట్లకు చేరింది. ఇండిగో,ఎటర్నల్,  ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, టైటాన్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటాన్, అదానీ పోర్ట్స్ తదితర షేర్లు లాభాల్లో పయనించాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *