టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (TLMAL) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ టిమ్ రిఫిల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. భారతదేశంలో లాక్‌హీడ్ మార్టిన్ కార్యకలాపాలకు సంబంధించిన ఇటీవలి పరిణామాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా C-130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను స్థాపించడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాల గురించి చర్చకు ఈ భేటీలో వచ్చింది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్త అవసరాలను తీర్చడం కోసం F-16 విమానాల రెక్కల (wings) ఉమ్మడి తయారీకి సంబంధించి లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. విమానాల ఎమ్.ఆర్.ఓ (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్) సదుపాయాలతో సహా రక్షణ రంగంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో, తెలంగాణలో మరిన్ని పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి కంపెనీ ఆసక్తిగా ఉందని మిస్టర్ రిఫిల్ సీఎంకు తెలిపారు.