దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ నగదును వారి వారి బ్యాంకు అకౌంట్స్ లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో రాష్ట్రంలో వంట గ్యాస్ సప్లై పై సచివాలయంలో నేడు సమీక్ష నిర్వహించారు. రాబోయే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు టార్గెట్ నిర్దేశించారు. శ్రీకాకుళం – కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై సీఎం అధికారులను వివరణ కోరారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో రివ్యూ మీటింగ్ నుండే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్ చేసి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.