రైమోనా నేషనల్ పార్క్ లో కొత్త రకం బల్లి జాతి..!

Spread the love

భారత్ ఎన్నో రకాల జీవ జాతులకు, జీవ వైవిధ్యానికి నిలయం. తాజాగా అసోంలో మరో కొత్త రకం జీవ జాతిని కనుగొన్నారు. కోక్రాఝర్ జిల్లాలోని రైమోనా నేషనల్ పార్క్ సమీపంలో ‘సిర్టోడాక్టిలస్ రైమోనెన్సిస్’ (Cyrtodactylus raimonaensis) అనే కొత్త రకం బల్లి జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.  ‘సిర్టోడాక్టిలస్ రైమోనెన్సిస్ అనే కొత్త రకం బల్లి జాతి కనుగొనబడింది. కాగా, దీనిపై ఆ రాష్ట్ర సీఎం హిమంత్ బిశ్వ శర్మ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసోంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ. మన రాష్ట్రంలోని గొప్ప జీవవైవిధ్యాన్ని చాటిచెప్పేలా ఈ జాతికి ఆ పార్క్ పేరునే పెట్టారన్నారు.  అసోం సహజ వారసత్వాన్ని భావితరాల కోసం భద్రపరచడానికి మరియు దాని గురించి మరింత అవగాహన పెంపొందించుకోవడానికి, ఇటువంటి ఆవాసాలను రక్షించడంలో మరియు శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇవ్వడంలో ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు.   2021లో నేషనల్ పార్క్‌గా ప్రకటించిన తర్వాత, ఇక్కడ కనుగొనబడిన మొదటి కొత్త జాతి ఇదేనని తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *