ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విన్నర్ గా నిలిచే టీమ్ ఈసారి భారీ ప్రైజ్ మనీ సొంతం చేసుకోనుంది. ఇంగ్లాండ్ వేదికగా జులై 12న మొదలయ్యే ఈ మెగా టోర్నీ ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ తాజాగా తెలిపింది. ఈసారి ట్రోఫీకి రూ.82 కోట్ల ప్రైజ్ మనీ కేటాయించింది. గత టోర్నీతో పోలిస్తే ఇది 10% ఎక్కువ. రాబోయే వరల్డ్ కప్ గెలిచే జట్టుకు రూ.21.8 కోట్లు నగదు బహుమతి అందనుంది. రన్నరప్ కు రూ.10 కోట్లు సెమీస్ లో పరాజయం చెందిన టీమ్ కు రూ.6.29 కోట్ల చొప్పున పొందుతాయి. ఒక్కో గ్రూప్ మ్యాచ్ విజయానికి రూ.29 లక్షల చొప్పున పొందనున్నాయి. ఇక ఈ టోర్నీలో ఆడే 12 జట్లు కనీసం రూ.2.06 కోట్లు ఖాతాలో వేసుకోనున్నాయి. భారత్ తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఈ టోర్నీలో బరిలోకి దిగుతాయి.