‘డెకాయిట్’ సినిమాపై రామ్ చరణ్ ప్రశంసలు 

Spread the love

ఇటీవలే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న చిత్రం ‘డెకాయిట్’. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లు జంటగా నటించిన ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. దీనిపై అగ్రనటుడు రామ్ చరణ్ తేజ్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. డెకాయిట్ సినిమా చూశాను, చాలా బాగా నచ్చింది. హరి పాత్రలో అడివి శేష్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. మృణాల్ ఠాకూర్ కూడా  తన పాత్రకు ప్రాణం పోశారు, ఆమె నటన అద్భుతం. అనురాగ్ కశ్యప్ సహా మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో సినిమా స్థాయిని పెంచారని ప్రశంసలు కురిపించారు. సుప్రియా యార్లగడ్డ, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఎంతో నమ్మకంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించారన్నారు. చిత్ర బృందానికి చరణ్ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. shaniel deo ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆసక్తికర కథాకథనాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమాకు పలువురు ప్రముఖుల నుండి కూడా మంచి స్పందన లభిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *