భారతదేశ చరిత్రలోనే ఏప్రిల్ 14కు అత్యంత ప్రాధాన్యం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఎందుకంటే- దేశ ప్రగతికి తన అవిరళ కృషి ద్వారా సకల ప్రజానీకానికి ఆరాధ్యుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి ఈనాడే. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ఈ నెల 16న. ‘నారీశక్తి వందన్ అధినియమ్’ (మహిళా రిజర్వేషన్ల చట్టం) సంబంధిత కీలక రాజ్యాంగ సవరణపై చర్చించి, ఏకాభిప్రాయ ఆమోద సాధన కోసం పార్లమెంట్ పునఃసమావేశం అవుతోన్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా అమితోత్సాహం ప్రస్ఫుటం కావడం నేను గమనిస్తున్నాను. వైవిధ్య భారత్ రూపకల్పనలో తమ వంతు సహకారానికి మరింత బలమైన అవకాశం లభ్యం కావడంపై దేశంలోని మహిళలందరూ హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.
దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న దానిని అమలు చేయడానికి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, భారతదేశ నారీశక్తికి ఆయన లేఖ రాశారు. నారీశక్తిగా మహిళలు జాతి జీవనంలోని ప్రతి అంశంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అసంఖ్యాక స్వయం సహాయ బృందాలు, లక్షాధికారి సోదరీమణులు స్వావలంబన సాధన ఎలాగో, ఇతర మహిళలకు ఎలా సాధికారత లభిస్తుందో ప్రత్యక్షంగా రుజువు చేస్తున్నారు. ఈ విధంగా అనేక రంగాలలో మహిళలు రాణిస్తున్న నేపథ్యంలో చట్టసభల్లోనూ వారి భాగస్వామ్యం పెంచడం ఎంతైనా సముచితమని పేర్కొన్నారు. పరాయి పాలన నుంచి మన దేశం విముక్తమై 2047 నాటికి వందేళ్లు పూర్తవుతాయి. అప్పటికల్లా వికసిత భారత్ స్వప్న సాకారం కోసం ప్రజలంతా తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జనాభాలో దాదాపు సగభాగమైన భారత నారీశక్తి ఆకాంక్షలకు పూర్తి న్యాయం చేసేందుకు మనం కృషి చేద్దాం. ఈ మేరకు విధాన రూపకల్పన, నిర్ణయ ప్రక్రియలలో వారు చురుకైన భాగస్వాములైతేనే వికసిత భారత్ వైపు మన ప్రయాణం మరింత వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యాన్ని అక్షర రూపంలో, స్ఫూర్తితో వీలైనంత త్వరగా కల్పించేలా చూడటం ప్రధానమని ఈ క్రమంలో 2029 లోక్ సభ ఎన్నికలు సహా అదే ఏడాది నిర్వహించే వివిధ శాసనసభల ఎన్నికలలో మహిళా రిజర్వేషన న్ను పూర్తిగా అమలు చేస్తే మన ప్రజాస్వామ్యం మరింత బలోపేతం చైతన్యవంతం కాగలదు. ఇందుకోసం పార్లమెంటులో ప్రవేశపెట్టే చట్టాన్ని పూర్తిస్థాయిలో ఆమోదించాలని పేర్కొన్నారు. మన శాసనసభలలో మహిళల గొంతు బలంగా వినిపిస్తేనే. ప్రజాస్వామ్య గళం కూడా మరింత బలం పుంజుకుంటుందన్నారు. అందుకే, పార్లమెంటు సమావేశాలతోపాటు రాజ్యాంగ సవరణకు ఆమోదం కోసం మీ ఆశీస్సులు సహా దేశం నలుమూలలాగల కోట్లాది మహిళల ఆశీర్వాదాలు కూడా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ చారిత్రక పార్లమెంటు సమావేశంలో పాల్గొంటున్న మీ ఎంపీలందరికీ ఈ మేరకు లేఖలు రాసి, వారిని ప్రోత్సహించాలని కోరారు.