వరుణ్ తేజ్ కు గాయం..ప్రస్తుతం కోలుకుంటున్న హీరో

Spread the love

వరుణ్ తేజ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘బరి’   కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది.  దీని కోసం వరుణ్ తేజ్ నిజంగా ఒక స్పోర్ట్స్ మెన్ గా కనిపించేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రోజూ గంటల కొద్దీ ప్రాక్టీస్ చేస్తూ, తన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ అన్నీ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కఠినమైన ప్రాక్టీస్ సమయంలోనే ఒక ప్రమాదం చోటుచేసుకుంది. వాలీబాల్ ప్రాక్టీస్ సెషన్‌లో వరుణ్ తేజ్ కాలికి గాయం కావడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ విషయాన్ని ఆయన సోదరి నిర్మాత నిహారిక అధికారికంగా వెల్లడించారు. మా అన్నయ్య వరుణ్ తేజ్ మా రాబోయే చిత్రం ‘బరి’ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా, ఇటీవల ఆయన మోకాలికి తీవ్రమైన గాయం (ఫ్రాక్చర్) అయినట్లు మీ అందరికీ తెలియజేస్తున్నాము.ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, శక్తితో తిరిగి వస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ సమయంలో మీరు చూపిస్తున్న ప్రేమ, ఆందోళన మరియు మద్దతుకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆమె తెలిపారు. వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన బాబాయ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. యువ కథానాయకుడు వరుణ్ తేజ్ ‘బరి’ సినిమా కోసం చేస్తున్న ప్రాక్టీసులో గాయపడ్డారని తెలిసింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వైద్యులు, ఫిజియోల సూచనలు పాటిస్తూ కోలుకొని, కెమెరా ముందుకు రావాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *